Politics: ముఖ్యమంత్రి పదవి అందుకోవాలి అంటే ప్రజలకు మంచి చేయాలి అలాగే ప్రజా పాలన మంచిగా ఉండటమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తే ప్రజలు మరోసారి ఆ నాయకుడికి పట్టం కడతారు అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి కావాలి అంటే జైలుకు వెళ్లి వస్తే చాలు ముఖ్య మంత్రి పదవి అందుకోవచ్చు అని తెలుస్తుంది.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారందరూ కూడా గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారే ఇలా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికలలో పోటీ చేస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవి వారిని వరిస్తుందని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ఎన్నికలు తేటతెల్లం చేశాయి. తాజాగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే నిజమని రుజువు చేశాయి.
2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక జగన్మోహన్ రెడ్డి హయామంలో చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి అందుకున్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో భాగంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి బయటికి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈయన భారీ మెజారిటీ సొంతం చేసుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా జార్ఖండ్ డైనమైట్ హేమంత్ సోరెన్ గెలుపుతో ఆ జైలు సెంటిమెంట్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
సోరెన్‌ది మామూలు విజయం కాదు… జార్ఖండ్‌లో 24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన మరుపురాని విజయం. సరికొత్త చరిత్రను లిఖించిన విజయం.జైలు జీవితం గడిపిన సోరెన్‌కే మళ్లీ పట్టం కట్టారు. జైలుకి వెళ్లిన నేతలకు మంచే జరుగుతుందని మరోసారి రుజువుచేశారు జార్ఖండ్‌వాసులు. ఇలా జైలుకు వెళ్లి వస్తే తరువాత ఎవరైనా ముఖ్యమంత్రి పదవి అందుకోవాల్సిందే అంటూ ఈ ముఖ్యమంత్రులందరూ కూడా జైలు సెంటిమెంటును రిపీట్ చేయడంతో ఇకపై ముఖ్యమంత్రి కావాలి అంటే జైలుకు వెళ్లాల్సిందే అనే విధంగా ఫలితాలు వెలబడుతున్నాయి.