బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతున్నది. ఈ సీజన్ కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్లలో వత్తులు వేసుకొని కూర్చున్నారు. అసలే కరోనా కాలం. ఎంటర్ టైన్ మెంట్ మిస్సయిపోతోంది. కనీసం ఈ షో ద్వారానైనా ఎంతో కొంత వినోదం దొరుకుతుందన్న ఆశలో ప్రేక్షకులు ఉన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. షో ఈనెల 30 నంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే… ఈ సీజన్ కు ఎంపికైన కంటెస్టెంట్లు.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవరకు ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవ్వరితో పంచుకోకూడదు. వాళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు.. అనే విషయాన్ని అఫీషియల్ గా బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించేవరకు వాళ్లెవరూ బయట చెప్పకూడదు. దానికి సంబంధించిన ట్వీట్లు చేయకూడదు. సోషల్ మీడియాలో పెట్టకూడదు.
అయితే.. ఇప్పటికే ఫైనల్ లిస్టులో ఉన్న సింగర్ గీతా మాధురి భర్త నందు తొందరపడ్డాడు. తన ఉబ్బును ఆపుకోలేకపోయాడు.
డార్లింగ్స్ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నాను. బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు. మస్తు ఎంటర్ టైన్ మెంట్ రాబోతున్నది. మీ సపోర్ట్ కావాలి. రేపు సాయంత్రం 6 గంటలకు మరో అప్ డేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.. టచ్ లో ఉండండి.. అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు.
అంతే.. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? అయ్యో నందు.. నీ గోతి నువ్వే తీసుకుంటున్నావా? బిగ్ బాస్ హౌస్ లో వెళ్లేవరకు ఆ సీక్రెట్ ను ఎవ్వరికీ చెప్పకూడదు. నువ్వు ఆగకుండా ముందే చెప్పేశావు. మంచి చాన్స్ ను మిస్ చేసుకోబోతున్నావు. నిన్ను షో నుంచి తప్పించేస్తారు చూడు.. అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికే ఆ పోస్ట్ వైరల్ కూడా అయింది. ఒకవేళ ఈ విషయం బిగ్ బాస్ యాజమాన్యానికి తెలిస్తే.. నందును షో నుంచి తప్పిస్తారా? లేదా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే.