అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిపాలైన నటుడు కమల్ హాసన్.. ఆందోళనలో అభిమానులు!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో అగ్ర హీరోగా లెజెండరీ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ జ్వరంతో బాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఈయనని చెన్నైలోని పోరూరు రామచంద్ర హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు సమాచారం.ఇలా అనారోగ్య సమస్యల కారణంగా కమల్ హాసన్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమల్ హాసన్ నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఉన్నఫలంగా ఈయనకు అస్వస్థత చేయడంతో హాస్పిటల్లో చేరారు.నిన్న హైదరాబాద్లో సందడి చేసిన కమల్ హాసన్ దర్శకుడు కళాతపస్వీ కే విశ్వనాథ్ గారిని కలిసి ఆయనతో ముచ్చటించి తన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నిన్న వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి కమల్ హాసన్ నిన్న సాయంత్రం చెన్నై చేరుకున్నారు.

ఇలా చెన్నై వెళ్లిన ఈయన జ్వరంతో బాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆసుపత్రిలో చేరారని సమాచారం. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన పరిస్థితి తెలుసుకున్నటువంటి అభిమానులు సినీ సెలబ్రిటీలు కమల్ హాసన్ త్వరగా తిరిగి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈయన సినిమాల విషయానికి వస్తే చాలా సమస్యలు తర్వాత విక్రమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.