ఆచార్య ఆడియో రైట్స్.. ఆదిత్య మ్యూజిక్ భారీ డీల్

Producers spend a lot of money for Chiranjeevi's intro song in acharya movie

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో ‌లో వస్తోన్న ఆచార్య సినిమా మెగా అభిమానులతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సామాజిక అంశాలకు కమర్షియల్ ఫార్ములాను జోడించి భారీ విజయాలు అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తుండటంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Acharya team clarity on story copy rumors

ఆచార్య ఇంకా సెట్స్‌పై ఉండగానే నిర్మాతలు నాన్-థియేట్రికల్ రెవెన్యూ కింద పెద్ద మొత్తంలో అందుకోబోతున్నారని టాక్. అది ఆడియో హక్కుల ద్వారా అని అంటున్నారు. ‘అల.. వైకుంఠపురములో..’తో కిందటేడాది భారీ విజయాన్ని అందుకోవడంతో కోట్లు గడించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఇప్పుడు ‘ఆచార్య’ ఆడియో రైట్స్‌ను చేజిక్కించుకుంది అనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా రూ.4 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి ‘ఆచార్య’ హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుందట.

ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మణిశర్మ కెరీర్ ‌లో ఇదే భారీ డీల్ అని అంటున్నారు. మణిశర్మతో కలిసి పనిచేయడం కొరటాల శివకు ఇదే తొలిసారి. కొరటాల శివ గత చిత్రాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు చిరంజీవి కోరిక మేరకు మణిశర్మను తీసుకున్నట్టు సమాచారం. కాగా, శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.