మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. “లాహే లాహే”… అంటూ మొదలయ్యే ఈ గీతానికి మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. ‘లాహే లాహే’ గీతం ట్యూన్, సాహిత్యం ఇప్పుడొస్తున్న జానపద గీతాల ట్రెండ్ కు కాస్తంత దగ్గరగానే ఉన్నాయి.
‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ‘ఆచార్య’ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటలో చిరు డాన్సులు కూడా బాగానే ఉండబోతున్నాయి. కాజల్ అగర్వాల్, సంగీత లాహే లాహే పాటలో చిందేసారు. చిరు కూడా మధ్యలో వచ్చి తనదైన స్టెప్పులతో పిచ్చెక్కించాడు. కచ్చితంగా ఆచార్యలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని ముందు నుంచి కొరటాల చెప్తూనే ఉన్నాడు. కానీ నక్సలిజం బ్యాక్‌డ్రాప్ అనగానే చాలా వరకు డాన్సులు, కామెడీ ఉండవని ఫిక్స్ అయిపోయారు. పైగా సైరాలో కూడా చిరు డాన్సులు చేయలేదు. ఆ కాన్సెప్ట్ అలా ఉంది.
అయితే ఆచార్యలో మాత్రం అలాంటివేం పెట్టుకోవద్దని.. కచ్చితంగా మెగా స్టెప్పులు ఇందులో అందర్నీ అలరిస్తాయని చెప్తున్నాడు దర్శకుడు కొరటాల. ఖైదీ నెం 150లో తనదైన స్టెప్పులతో పిచ్చెక్కించిన మెగాస్టార్.. ఇప్పుడు ఆచార్యలో మరోసారి ఇదే చేయబోతున్నాడన్నమాట. ఏదేమైనా ఈ పాట చూసిన తర్వాత మణిశర్మకు కూడా ఓ వేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ పాట కోసమే అప్పట్లో భారీ సెట్ కూడా వేసారు. దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. భారీ హుంగలతో ఓ జాతర లాంటి పాటను చిత్రీకరించాడు కొరటాల. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది.