ప్రభాస్ ‘సలార్-2’ డౌటేనా.? నిజమెంత.?

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి చాన్నాళ్ళే అయ్యింది. ‘ప్రభాస్ ఈజ్ బ్యాక్’ అన్నారుగానీ, అంచనాల్ని అందుకోలేకపోయింది.

మొదటి పార్ట్ ముగిస్తూ, రెండో పార్ట్‌కి సంబంధించిన విషయాన్ని స్పష్టంగానే చెప్పేశాడు దర్శకడు ప్రశాంత్ నీల్. ఇంతకీ, ఆ పార్ట్ -2 ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.? అంటే, దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

ప్రస్తుతానికైతే ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్టులున్నాయి. ఈ క్రమంలో ‘సలార్-2’ ఎప్పుడు పట్టాలెక్కుతుంది.? అన్నదానిపై స్పష్టమైన సమాచారం దొరకడంలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సింది.

ప్రశాంత్ నీల్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా వున్నారనుకోండి.. అది వేరే సంగతి. అయితే, ఈ ముగ్గురిలో ఎవరితోనూ ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ సినిమా చేసే అవకాశమే లేదు.

ఒకవేళ ‘సలార్-2’ గనుక ఇంకా వెనక్కి వెళితే, జూనియర్ ఎన్టీయార్ సినిమా కాకుండా మరో సినిమాని టేకప్ చేయాలనే ఆలోచనతో వున్నాడట ప్రశాంత్ నీల్. కానీ, ఏ హీరోతో.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. ‘దేవర’ పూర్తయితేనేగానీ, జూనియర్ ఎన్టీయార్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు.

‘దేవర’ కూడా రెండు పార్టుల్లో రిలీజ్ కానుంది. దాన్ని మూడు పార్టులు చేయాలన్న సమాలోచనలు కూడా జరుగుతున్నాయి.