బిగ్ బాస్ విజేతగా అభిజిత్ క్రేజ్ ఇప్పుడు వేరే లెవెల్. మామూలుగా అయితే అభిజిత్ విన్నర్ అన్న సంగతి ఎప్పుడో రెండు నెలల క్రితమే ఫిక్స్ అయింది. ఎందుకంటే అభిజిత్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. నామినేషన్స్‌లో అభిజిత్ ఉన్న వారాల్లో ఓటింగ్ ట్రెండ్ చూస్తే రికార్డులు బద్దలయ్యేవి. అభిజిత్ నామినేషన్స్‌లో లేకపోతే ఓట్లు కూడా సరిగ్గా పడేవి కాదు. ఇక నామినేషన్ లిస్ట్‌లో అభిజిత్‌కు పడే ఓట్లు మిగతా కంటెస్టెంట్ల అందరికీ పడే ఓట్లన్నంటికే ఎక్కువగా ఉండేవని టాక్.
అలాంటి అభిజిత్ గెలుపు ఎప్పుడు ఖరారైంది. అభిజిత్ కెప్టెన్ కాకపోయినా, టాస్కుల్లో చొక్కాలు చించుకుని పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా టైటిల్ కొట్టేశాడు. అభిజిత్ ప్రవర్తన, ఆ కామ్ నెస్, ఆ మెచ్యూర్డ్ వల్లే అది సాధ్యమైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే విజేతగా నిలిచి వచ్చిన అభిజిత్ బయటకు తన మీద కురిపిస్తున్న ప్రేమను చూసి ఎమోషనల్ అయ్యాడు. తనపై ప్రేమను కురిపించి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాలని అభిజిత్ చెప్పాడు.
ఆ క్రమంలోనే అభిజిత్ తన అభిమానులతో ముచ్చటించేందుకు ట్విట్టర్‌లోకి వచ్చాడు. లైవ్ సెషన్స్‌లో ఎంతో మంది అభిమానులను ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అందులో ఓ ఫ్యాన్ వెరైటీ క్వశ్చన్ అడిగాడు. మామూలుగా సెలెబ్రిటీలు తమ టీంను పెట్టి.. వారితో సమాధానాలు చెప్పిస్తుంటారు. నువ్వే రిప్లై ఇస్తున్నావా? లేదా నీ టీంతో రిప్లై ఇప్పిస్తున్నావా? అని ప్రశ్నించాడు. ఆ ట్వీట్‌ను చూసి అభిజిత్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. పులి ఇక్కడ.. అంటూ నేనే రిప్లై ఇస్తున్నా అంటూ చెప్పకనే చెప్పేశాడు.