ఇది మామూలు క్రేజ్ కాదు.. అభిజిత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్

అభిజిత్‌కు ప్రస్తుతం ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అతని మెచ్యూరిటీ, స్టార్ట్ నెస్, కూల్ నెస్, మాట్లాడే విధానం ఇలా ప్రతీ ఒక్కటి అందరినీ కట్టిపడేసింది. మామూలు జనాలనే కాకుండా.. సెలెబ్రిటీలను సైతం ఆకట్టుకున్నాడు. అలా అభిజిత్‌కు క్రికెటర్లలోనూ ఫాలోయింగ్ ఏర్పడింది. హనుమ విహారి ఏకంగా సపోర్ట్ చేయండి.. ఓట్లు వేయండంటూ పోస్ట్‌లుకూడా పెట్టేవాడు. అభిజిత్ గెలిచి వచ్చాక ఈ విషయం తెలిసి ఎంతో సంతోషించాడు.

Rohit Sharma Gift To Abhijeet
Rohit Sharma Gift To Abhijeet

తాజాగా అభిజిత్‌కు రోహిత్ శర్మ ఓ గిఫ్ట్ పంపాడు. తన జెర్సీని పంపుతూ కంగ్రాట్స్ తెలిపాడు. ఈ గిఫ్ట్‌ను చూసి అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాను. కాని విధి అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే అంతా జరుగుతుంది. కానీ క్రికెట్ అంటే ఇప్పటికీ చిన్న పిల్లాడిలా మారిపోతాను. ఇది నిజంగా నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాంటిందంటూ అభిజిత్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టాడు.

హిట్ మాన్ రోహిత్ శర్మ నాకోసం ఇది పంపాడు.. నాకు ఇది చాలు.. ఎంతో సంతృప్తినిచ్చింది. ఆస్ట్రేలియా నుంచి హలో చెప్పాడు. ఈ గిఫ్ట్ పంపినందుకు థ్యాంక్స్ హనుమవిహారి. మీరు త్వరగా కోలుకోండి.,. ఆటలో మీరు అత్యున్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ ఉంటే అది ఆటలా అనిపించదు.. అది ఒక ఆర్ట్‌లా అనిపిస్తుంది. పులులు.. మీరంతా వారికి సపోర్ట్ చేయండి.. బార్డర్ గవాస్కర్ ట్రోపీ గెలిచి తీసుకురావాలని కోరండని తన అభిమానులకు అభిజిత్ పిలుపునిచ్చాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles