అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా ప్రకటించిన బిగ్ బాస్… రగిలిపోతున్న ఫ్యాన్స్ !

abijeet fans are very angry on biggboss

గత రెండు రోజులుగా బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ , ‘జలజ దెయ్యం’లో ఇంటి సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు. ఇది బిగ్ బాస్ ఇళ్లు అని… బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏదీ జరగదన్న విషయం మరిచిపోయారని, జలజ మీకు ఇచ్చిన టాస్క్‌లను నిరాకరించారని.. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా ప్రకటించారు బిగ్ బాస్. ఈ కారణంగా ఇంటి సభ్యులకు ఎటువంటి లగ్జరీ బడ్జెట్ లభించదని కనీసం.. 12 వారాల ప్రయాణం తరువాత అయినా టాస్క్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు బిగ్ బాస్.

abijeet

ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు. అయితే వీరి చర్చల్లో భాగంగా అవినాష్ తనకు ఇచ్చిన టాస్క్‌ని చేశానని.. అఖిల్-మోనాల్‌లు డేట్‌కి వెళ్లారని చెప్తూ.. అభిజిత్ పేరుని ప్రస్తావించాడు.దీంతో అభిజిత్ రియాక్ట్ అవుతూ.. నా పర్శనల్ విషయం నేనే మాట్లాడతాను అని … ఈ టాస్క్ బిగ్ బాస్ ఇస్తున్నారా ? వేరే వాళ్లు చేయిస్తున్నారా? అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. బిగ్ బాస్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చిన తరువాతే ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని తెలిసింది’ అని చెప్పాడు.

ఇక మోనాల్‌తో డేట్ విషయం గురించి బిగ్ బాస్‌తో మాట్లాడుతూ.. ‘మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వల్ల నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. ఆ లెటర్‌లో మీరు ఫ్రేమ్ చేసిన పదాలు (అఖిల్, అభిజిత్‌లు మోనాల్‌ని ఏడిపించారు) నాకు అర్థంకాలేదు.. ఆమెను నేను ఏడిపించాను అంటే పర్సనల్‌గా హర్ట్ అయ్యాను. అందుకే టాస్క్‌లో పెర్ఫామ్ చేయలేదు. 12వ వారాల జర్నీలో నేను హర్ట్ అయ్యా.. అందుకే దీన్ని పర్శనల్‌గా తీసుకున్నా. ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నా’ అని క్లారిటీ ఇచ్చాడు అభిజిత్. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌నే సరిగా లేదని.. క్లారిటీ లేకుండా టాస్క్‌లు ఇచ్చి.. చెట్లు ఆకులు లెక్కపెట్టాలి.. డేట్ చేయాలి లాంటి పిచ్చి టాస్క్‌లు ఇస్తే ఎవరు చేస్తారు.? అభిజిత్ రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అంటున్నారు అతని ఫ్యాన్స్. అంతేకాదు ఈ పిచ్చి టాస్క్‌లో అభిజిత్‌ని వరస్ట్ పెర్పామర్ అనడం పట్ల హర్ట్ అవుతున్నారు అభి ఫ్యాన్స్.