Home News న‌ల‌బై ఏళ్ళ హీరో 80 ఏళ్ళ వ్య‌క్తిగా మారాడేంటి?.. కార‌ణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు

న‌ల‌బై ఏళ్ళ హీరో 80 ఏళ్ళ వ్య‌క్తిగా మారాడేంటి?.. కార‌ణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు

ఇండ‌స్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు సినిమా కోసం ప్రాణం పెట్టి ప‌ని చేస్తుంటారు. మంచి పాత్ర దొరికితే దాని కోసం ఎంత రిస్క్ అయిన చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌రు. అలాంటి వారిలో క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్, అజిత్, రామ్ ఇలా త‌దిత‌ర హీరోలు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బీ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న టాలెంట్ ఏంటో నిరూపించుకునేందుకు స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. ఇప్పుడు అత‌ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, అభిషేక్‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు.

Abi800 | Telugu Rajyam

ఒక‌ప్పుడు అభిషేక్ అద్భుత‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. కాని ఇప్పుడు చెప్పుకోద‌గ్గ చిత్రాలు చేయ‌డం లేదు. దీంతో నెటిజ‌న్స్ కూడా అభిషేక్‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ ట్రోల్ చేస్తుంటారు. దానికి అభిషేక్ పాజిటివ్‌గా, తెలివిగా స్పందిస్తుంటాడు. అయితే ప్ర‌స్తుతం త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం బాబ్ బిస్వాస్ తో తానేంటో నిరూపించుకోవాల‌ని అభిషేక్ భావిస్తున్నాడు. ఇందుకోసం సరికొత్త లుక్‌లోకి మారాడు. ఫుల్‌ స్లీవ్‌ చొక్కా, పెద్ద కళ్లజోడు, మిడ్‌ పార్టీషియన్‌ జుట్టుతో అభిషేక్‌ని చూసి ఎవ‌రు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు.

అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం క‌హానీ చిత్రంలోని కాంట్రాక్ట్‌ కిల్లర్‌ బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో నటిస్తున్నారు. . సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ చిత్రంలోని కోల్డ్‌ బ్లడెడ్‌ కిల్లర్‌గా బిస్వాస్‌ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రముఖ బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ ఈ పాత్ర పోషించారు. ఇప్పుడు అదే పాత్ర‌ను అభిషేక్ పోషిస్తున్నారు. కోల్‌క‌తాలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సుజోయ్‌ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అభిషేక్‌ సరసన చిత్రాంగఢ సింగ్ నటిస్తున్నారు. జ‌న‌వ‌రిలో చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌గా క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డింది.

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News