Abhishek Bacchan : ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమే… అభిషేక్ బచ్చన్…!

Abhishek Bacchan : తాజాగా అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన సినిమా దస్వీ. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీ లో విడుదల చేశారు. చదువు దానికున్న ప్రాధాన్యత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ‘బ్రీత్‌’ వెబ్‌ సిరీస్‌ మూడో సీజన్‌లో కూడా నటిస్తున్నాడని సమాచారం.అయితే దస్వీ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ పాన్ ఇండియా సినిమాలు మేక తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

పాన్ ఇండియా సినిమాలు మీద తన అభిప్రాయాన్ని కల్పన ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అభిషేక్బచ్చన్ ఇలా సమాధానమిచ్చాడు… మరే పరిశ్రమకు ఈ పదాన్ని వాడటం లేదు అందుకే నాకు పాన్ ఇండియా సినిమా మీద నమ్మకం లేదు అని చెప్పారు. ఈ సినిమాను రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఒక ఛాయిస్ మాత్రమే, ఏ భాషలో తీసినా అంతిమంగా అది ఒక సినిమా అవుతుంది. మన భారతీయుల్లో సినిమా ప్రియులకు గా ఉండటంతో భాషతో పనిలేకుండా సినిమాని ఆదరిస్తారు. కే జి ఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధించాయి. సినిమా బాగుంటే ఎక్కడైనా హిట్ అవుతుంది సినిమా బాగాలేకపోతే ఎక్కడ తీసిన ఫ్లాప్ అవుతుంది.

బాలీవుడ్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావట్లేదు అన్న వాదనను అభిషేక్ బచ్చన్ కొట్టేశారు. గంగుబాయ్ కతీయవాడి, సూర్య వంశీ వంటి సినిమాలు మంచి హిట్ ను సాధించాయి. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక భాగమే అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.’ అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు.