Bigg boss 4: ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్ లో గుక్కపెట్టి ఏడ్చిన అభిజీత్

abhijeet cried in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ముందు అభిజీత్ పేరే వినొస్తుంది. అభిజీత్.. ఏం మాట్లాడినా ఓ క్లారిటీ ఉంటుంది. ఏ టాస్క్ వచ్చినా మైండ్ తో ఆడుతాడు. తొందరపడడు. ఏ పాయింట్ నైనా క్లియర్ గా చెప్పగలడు. ఆయనకూ కొన్ని మైనస్ లు ఉన్నాయి కానీ.. ఆయన తెలివి ముందు అవి పెద్దగా హైలెట్ అవ్వడం లేదు.

abhijeet cried in bigg boss house
abhijeet cried in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ కు క్లోజ్ అంటే హారిక మాత్రమే. లాస్య కూడా క్లోజే కానీ తనిప్పుడు లేదు. ఇక.. ఇప్పుడిప్పుడే సోహెల్ కూడా అభిజీత్ కు దగ్గరవుతున్నాడు. ఇక.. అఖిల్, అభిజీత్ మాత్రం బద్ధశత్రువుల్లా మారిపోయారు.

వాళ్లు కనీసం పలకరించుకోవడం లేదు.. మాట్లాడుకోవడం కూడా లేదు. కేవలం చూపులే. వీళ్లిద్దరికీ గొడవ వచ్చింది కూడా మోనల్ వల్లే. మళ్లీ ఆ మోనల్ ను ఉపయోగించి బిగ్ బాస్ మరో ఫిట్టింగ్ పెట్టాడు. అఖిల్, అభిజీత్.. ఇద్దరిలో ఎవరో ఒకరు మోనల్ ను డేట్ కు తీసుకెళ్లాలట. బిగ్ బాస్ ఇచ్చిన కొత్త టాస్క్.

వీళ్లిద్దరు మళ్లీ మాట్లాడుకోవాలని బిగ్ బాస్ వేసిన ప్లాన్ కావచ్చు ఇది. ఏది ఏమైనా అభిజీత్ కు ఈ టాస్క్ అస్సలు నచ్చలేదు. మళ్లీ ఈ మోనల్ మ్యాటర్ వద్దు నాకు.. నాకు ఎందుకు ఈ తలనొప్పి అని తల పట్టుకున్నాడు అభిజీత్.

ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. వెంటనే హారిక, సోహెల్.. అభిజీత్ ను ఓదార్చారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా బిగ్ బాస్ విడుదల చేశాడు.

#Monal ni date ki evaru teskeltharu?? #Abijeet or #Akhil?? #BiggBossTelugu4 today at 9:30 PM