జైల్లో ఉన్నందుకు రాలేకపోయాడు.. నవీన్ పొలిశెట్టిపై LIB హీరో కామెంట్స్

abhijeet and Vijay Devarakonda Life is beautiful Actors Reunion

LIB అంటే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వారంతా ఫేమస్ కాలేదు. కానీ చిన్ని చిన్న పాత్రాల్లో చేసిన వారంతా ఇప్పుడు స్టార్స్‌గా ఎదిగారు. నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. నవీన్ పొలిశెట్టి నేషనల్ వైడ్‌గా ఫేమస్. ఇక విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. కానీ హీరోగా చేసిన అభిజిత్, సుధాకర్ మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.

abhijeet and Vijay Devarakonda Life is beautiful Actors Reunion
abhijeet and Vijay Devarakonda Life is beautiful Actors Reunion

కానీ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్‌గా అభిజిత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అభిజిత్ ఇలా గెలుపొందండంతో LIB బ్యాచ్ అంతా కలిసి పార్టీ చేసుకుంది. విజయ్ దేవరకొండ ఇంట్లోస్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో LIB నటీనటులు పాల్గొన్నారు. కానీ నవీన్ పొలిశెట్టి మాత్రం హాజరు కాలేకపోయాడు. ఈ రోజు నవీన్ బర్త్ డే కూడా. కానీ జాతిరత్నాలు షూటింగ్‌లో ఉండటం మూలానా రాలేకపోయాడు. దీనిపై సుధాకర్ వెరైటీగా కామెంట్ చేశాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అభిజిత్ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సుధాకర్ ట్వీట్ చేస్తూ.. రీయూనియన్ ఆఫ్ ది ఇయర్ అంటూ చెప్పుకొచ్చాడు.. LIB ఫ్రెండ్స్‌ అందరం కలిసి ఎంజాయ్ చేశాం.. కానీ నవీన్ బర్త్ డే బాయ్.. జైల్లో ఉండటంతో రాలేకపోయాడంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి అభిజిత్ విజయ్ దేవరకొండ కాంబో మాత్రం కన్నుల పండువగా ఉంది.