Home News అఖిల్ మదర్‌కు హారిక ఇష్టం, అభిజిత్ ఫాదర్‌కు మోనాల్ అంటే ఇష్టం..భలే విచిత్రం గురూ...

అఖిల్ మదర్‌కు హారిక ఇష్టం, అభిజిత్ ఫాదర్‌కు మోనాల్ అంటే ఇష్టం..భలే విచిత్రం గురూ !

బిగ్ బిస్ తెలుగు ఇంట్లో ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పట్నుంచి ఒక లెక్క. సీజన్ ఎండింగ్ కి వచ్చిన క్రమంలో పరిణామాలు వేగంగా ఛేంజ్ అవుతున్నాయి. శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రులుగా మారారు. అఖిల్, మోనాల్ మధ్య సోమవారం ఓ రేంజ్ వార్ జరిగింది. అనూహ్యంగా మోనాల్, అభిజిత్ కాస్త దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నారు. మోనాల్ అనూహ్యంగా పుంజుకుంది. అయితే ఇటీవల బిగ్ బాస్ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికర పరిణామాన్ని గమనించాల్సి ఉంది. బిగ్ ఇంట్లోకి ఇటీవల కుటుంబ సభ్యులు, ఆత్మీయులు వచ్చారు. ఈ సందర్భంగా అఖిల్ మదర్ ఇంట్లోకి వచ్చినప్పుడు…తనకు కూతురు లేదని, ఉంటే హారిక ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఎపిసోడ్ లో నాగార్జున మరికొందర్ని స్టేజ్ పైకి తీసుకొచ్చారు. వారితో టాప్ 5 కంటెస్టెంట్లుగా ఎవరుంటారనుకుంటున్నారో తెలుపమన్నాడు. ఈ క్రమంలో అభిజిత్ ఫాదర్ అనూహ్యంగా మోనల్ కు టాప్ 5 లో స్థానం కల్పించాడు. దీంతో ఇంట్లో సినారియో మొత్తం మారిపోయింది.

Abi Monak | Telugu Rajyam

తాజాగా అభిజిత్, మోనాల్ మధ్య సాఫ్ట్ కార్నర్ మొదలైనట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్‌, మోనాల్ మధ్య అంతా కట్ అయినట్లే కనిపిస్తోంది. మోనాల్ త‌నను మోసం చేసింద‌న్న భ్ర‌మ‌లో అఖిల్ నైరాశ్యంలో మునిగిపోయాడు. అటు మోనాల్ కూడా అఖిల్ ను ఇకపై వెనకేసుకు రావడానికి సిద్దంగా కనిపించడం లేదు. ఈ క్రమంలో అభి, మోనాల్ చాలారోజుల తర్వాత కాసేపు సరాదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. తన ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అని… నువ్వు ఆయనకు నచ్చ‌డ‌మేంటో అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. దీంతో ఈ జంటకు మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయని వీక్షకులు భావిస్తున్నారు. అటు హారిక అభికే సపోర్ట్ చేస్తోంది, మోనాల్ కూడా అభి వైపు వచ్చేసింది.

ఇన్నాళ్లు మోనాల్ కు క్లారిటీ లేదని, ఇప్పుడు అంతా ట్రాక్ లోకి వచ్చిందని..ఇక అసలైన మజా ముందుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకు టాప్ 5 లో ఉంటారన్న కంటెస్టెంట్లు వేరు, ఇప్పుడు అందుతోన్న ట్రెండ్స్ వేరు. పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఏమైనా జరగొచ్చు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వొచ్చు అని తాజా పరిస్థితులు బట్టి అర్థమవుతోంది. నామినేషన్ లో లేని అభి-హారిక ఫ్యాన్స్ అందరూ మోనాల్ కు ఓట్లు గుద్దేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం సంచలనాలకు సిద్దంగా ఉండండి.

- Advertisement -

Related Posts

” ఫస్ట్ ఆ ఎన్నికలు , తరవాత ఈ ఎన్నికలు ” ప్రకటించేసిన జగన్, ఎవ్వడైనా సైలెంట్ అయిపోవాల్సిందే !

గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనను ఒక ప్రభుత్వ అధికారి కంటే కూడా...

విజయవాడ దుర్గ గుడికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్

నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు....

ఆ విషయంలో ఎన్నడూలేనంత కంగారు పడుతున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు...

అలా ఎమోషనల్.. చిట్టి చెల్లితో రష్మిక ఆటలు

రష్మిక మందాన్నకు ఓ చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ మధ్య తెగ సెటైర్లు వచ్చాయి. రష్మిక మందాన్న ఏజ్‌కు, తన చెల్లి ఏజ్‌కు మధ్య అంత గ్యాప్...

Latest News