Aadi Pinishetti:ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి పోతినేని రామ్ తో కలిసి ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు.హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా ఆది పినిశెట్టి సన్నిహితుల ద్వారా ఆది, నిక్కీ ల వివాహానికి ఇరువర్గాలు ఒప్పుకున్నారని, త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని వార్తలు జోరుగా వినిపించాయి.ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్ గా కలిసి రెండు తమిళ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నీ నిజమయ్యాయి.
The best thing to hold onto in life is each other.We found each other a couple of years ago & it’s official now!
24.3.2022 was special for us. We got engaged in the presence of both our families.
Seeking all ur love & blessings as we take on ths new journey together🙏 pic.twitter.com/zRmf9VfXwh— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2022
మార్చి 24వ తేదీని నిక్కీ, ఆది పినిశెట్టిలు ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆది సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపాడు. `జీవితంలో ఒకరినొకరు పట్టుకుని నడవడం అతి ముఖ్యమైంది. అలా జీవితాంతం ఉండగలమనే విషయాన్ని మేం ఇద్దరం గత కొన్నేళ్ల క్రితమే కనుగొన్నాం.ఇప్పుడు అది అధికారకమైంది.. 24.03.2022 మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. మా ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి` అంటూ ఆది ట్వీట్ చేశాడు. దీంతోపాటు నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.