Aadi pinishetty: త్వరలో హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్న ఆది… ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

 

Aadi Pinishetty: ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి, పోతినేని రామ్ తో కలిసి ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు.హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్ గా కలిసి రెండు తమిళ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. కానీ వీరి ప్రేమ గురించి ఇంత వరకు ఈ జంట నోరువిప్పలేదు.

ఇదిలా ఉండగా, ఆది పినిశెట్టి సన్నిహితుల ద్వారా ఆది, నిక్కీ ల వివాహానికి ఇరువర్గాలు ఒప్పుకున్నారని, త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని  వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా వీళ్ళు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వీరి వివాహం జరగబోతోందని చెబుతున్నారు. కానీ ఆ విషయం ఏంటి అనేది వీరిద్దరు నోరు విప్పితే కానీ తెలీదు