Jabardasth: అనసూయ మీద ఉన్న ప్రేమను ఎట్టకేలకు బయటపెట్టేసిన హైపర్ ఆది

aadi expresses his love to anasuya in jabardasth skit

ప్రస్తుతం జబర్దస్త్ పరిస్థితి ఎలా మారింది అంటే.. హైపర్ ఆది ఉంటేనే జబర్దస్త్ అన్నట్టుగా మారింది. హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు బోలెడు మంది. జబర్దస్త్ అంటేనే హైపర్ ఆది.. హైపర్ ఆది అంటేనే జబర్దస్త్. హైపర్ ఆది స్కిట్ నే ప్రోమోలోనూ, జబర్దస్త్ ప్రోగ్రామ్ లోనూ హైలెట్ చేస్తున్నారు.

aadi expresses his love to anasuya in jabardasth skit
aadi expresses his love to anasuya in jabardasth skit

తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి తన స్కిట్ లో ఏకంగా అనసూయను విపరీతంగా వాడేసుకున్నాడు హైపర్ ఆది. అనసూయ మీద తనకు ఎప్పటినుంచో లవ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని చాలాసార్లు ఆది చెప్పినప్పటికీ… అనసూయ మాత్రం ఓ నవ్వు నవ్వి వదిలేస్తుంది. అంటే.. అనుకు కూడా ఆది అంటే ఇష్టమే కానీ.. తనకు పెళ్లయిపోయింది కదా.

కానీ.. ఆది మాత్రం తన సిన్సియర్ లవ్ ను తన స్కిట్ సమయంలో ఎప్పుడో ఒకప్పుడు చెబుతూనే ఉంటాడు. తాజాగా అదే జరిగింది. ఈసారి అనసూయ మీదనే ఓ స్కిట్ చేసేశాడు. అనసూయను ప్రేమించి.. ప్రేమించి దేవదాసు అయిపోతాడు ఆది. అయినా కూడా అనసూయ.. ఆదిని పట్టించుకోదు. నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా..నేను ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతా అంటూ అనసూయ ఆదికి చెప్పడం.. నువ్వు ఒక్కసారైనా నాతోటి ప్రేమగా మాట్లాడావా? అంటూ ఆది.. అనసూయను అడుగుతాడు.

మరోవైపు మిగితా కంటెస్టెంట్లు అనసూయను చూసి.. అరె.. అమ్మాయి బాగుంది.. నేను కర్చీప్ వేస్తా అని అనేసరికి.. వెంటనే ఆది అందుకొని.. నేను పెద్ద టెంట్ నే వేశా. కానీ ఏం లాభం. వర్కవుట్ కాలేదు.. అంటూ అనసూయ మీద తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు ఆది.

Jabardasth - Jabardasth Latest Promo - 22nd October 2020 - Anasuya, Hyper Aadi - Mallemalatv