ఇండస్ట్రీ టాక్ : వెరీ స్పెషల్ ప్లేస్ లో “వాల్తేరు వీరయ్య” భారీ ఈవెంట్.!

ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ క్రేజీ మల్టీ స్టారర్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ కూడా కలిసి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై  అంతకంతకు అంచనాలు పెరుగుతూ వస్తుండగా ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజి కి వచ్చేసింది.

ఇక దీనితో మరో పక్క సినిమా రిలీజ్ కి కూడా సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు ఈ సినిమాపై అయితే సినీ వర్గాల నుంచి తెలుస్తున్నాయి. మరి అలా ఇప్పుడు ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఫిక్స్ అయ్యింది అనేది తెలుస్తుంది.

మరి లేటెస్ట్ సమాచారంతో అయితే చిత్ర బృందం ఓ స్పెషల్ ప్లేస్ ని ఫిక్స్ చేశారట. ఈ సినిమా టైటిల్ చూస్తేనే చిరు పక్కా మాస్ పాత్రలో అందులో ఓ మత్యకారుని పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ అర్ధం అవుతుంది. మరి అందుకే చిత్రం ఈవెంట్ ని సాగరతీరం ఉన్న విశాఖపట్నంలో ప్లాన్ చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అలాగే ఈ చిత్రం ఈవెంట్ అయితే జనవరి మొదటి వారంలో చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అనౌన్సమెంట్ ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 13న రిలీజ్ కాబోతుంది.