“ఇండియన్ 2” లో మైండ్ బ్లాకింగ్ ఏక్షన్ సీన్.!

తమిళ సీనియర్ స్టార్ హీరో ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ భారీ బాక్సాఫీస్ హిట్ సినిమా “విక్రమ్” తో మళ్ళీ తన కెరీర్ ని గాడిలో పెట్టగా ఇక నెక్స్ట్ అయితే మరిన్ని క్రేజీ సినిమాలతో తాను సిద్ధం కానున్నారు. మరి ఈ సినిమాల్లో పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో చేస్తున్న “ఇండియన్ 2” కూడా ఒకటి.

కాగా అనేక అంతరాయాలు తర్వాత స్టార్ట్ అయ్యిన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ని శంకర్ ప్లానింగ్ ప్రకారం తన లెవెల్లోనే హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ఉన్న ఓ ఏక్షన్ బ్లాక్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు బయటకి వచ్చింది.

ఈ సినిమాలో ఇప్పుడు శంకర్ ఓ మైండ్ బ్లాకింగ్ ట్రైన్ ఏక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారట. ఈ సీన్ ఆఫ్రికా లో షూట్ చేయనుండగా ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ భారీ సీన్ అయితే ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

శంకర్ సినిమాల్లో ఏక్షన్ ఎప్పుడూ సరిక్రొత్తగా కొందరు హాలీవుడ్ డైరెక్టర్ లను సైతం ప్రేరేపించేలా ఉంటుంది. ఇక ఈ సినిమాకి ఎలాంటి సీన్స్ తాను డిజైన్ చేయించుకున్నారో చూడాలి మరి. కాగా ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ హౌస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.