శంకర్ సినిమాలో 1000 మందితో రామ్ చరణ్ భారీ సీన్..ఇంతకీ ఏ సీన్ అంటే.!

Producer Dil Raju gave a new update about Ram Charan and Shankar movie

తమిళ బిగ్గెస్ట్ సినిమాల దర్శకుడు శంకర్ సినిమాలు అంటేనే ఒక గ్రాండియర్.. బడ్జెట్ ని ఓ రేంజ్ లో పెడుతూ క్రేజీ విజువల్స్ ని తన సినిమాల్లో అత్యంత స్టైలిష్ చూపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెలుగు తమిళ్ మరియు హిందీ భాషల్లో భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కోసమే అన్నట్టు మళ్ళీ ఓ భారీ సీక్వెన్స్ ని పెట్టారంటూ ఓ టాక్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ మగధీర, వినయ విధేయ రామ, అలాగే లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్(RRR) లాంటి చిత్రాల్లో చరణ్ వర్సెస్ వందలు వేలు మందితో క్రేజ్య్ యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు వాటి తరహాలోనే శంకర్ సినిమాలో కూడా 1000 మందితో రామ్ చరణ్ పై ఓ భారీ సీన్ ని శంకర్ డిజైన్ చేసారని గట్టి టాక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే దీనిపై అంతా క్లారిటీ ఏమిటంటే ఇది ఒక మాసివ్ సాంగ్ కోసం అన్నట్టు తెలుస్తుంది. శంకర్ సినిమాల్లో ఏక్షన్ సీన్స్ తో పాటుగా పాటలు కూడా అంతే గ్రాండ్ గా ఉంటాయి.

దాదాపు అయితే ఈ 1000 మంది అనే టాక్ సాంగ్ కోసమే అన్నట్టుగా తెలుస్తుండగా దీనిపై అయితే ముందు రోజుల్లో అసలైన క్లారిటీ వస్తుందని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం ఇస్తున్నాడు అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.