ఈ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఇండియా బిగ్గెస్ట్ మాస్ థ్రిల్లర్ “సలార్” అనే చెప్పాలి.
అయితే నిజానికి సరిగ్గా ఇదే రోజు గత నెల సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి ఉండాల్సిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ కి షిఫ్ట్ చేసేసారు. మరి డిసెంబర్ లో అయితే చిన్న పోటీ ఉండగా అనుకుంటే అటు హిందీ నుంచి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రెండు భారీ హిట్స్ కొట్టిన తర్వాత మూడో 1000 కోట్ల సినిమా అన్నట్టుగా దర్శకుడు రాజు హిరాణితో చేసిన సినిమా డున్కి తో రాబోతున్నాడు.
అయితే ఈ సినిమా ఒక రోజు గ్యాప్ లో రాబోతుంది కానీ షారుఖ్ మార్కెట్ ఓవర్సీస్ లో ప్రభాస్ కంటే చాలా ఎక్కువ ఉంది. అయినా సలార్ సినిమాకి దర్శకుడు బ్రాండ్ కూడా కలవడంతో ఓకే మాసివ్ రిలీజ్ అయితే ఓవర్సీస్ లో దక్కింది కానీ ఇపుడు అసలు షాకింగ్ ట్విస్ట్ అయితే సలార్ కి తగిలింది.
సలార్ రిలీజ్ డేట్ లోనే అంటే సరిగ్గా డిసెంబర్ 22న హాలీవుడ్ లో ఇటీవల కాలంలో మంచి మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన చిత్రం “ఆక్వా మ్యాన్ 2” ని మేకర్స్ తాజాగా డేట్ లాక్ చేసారు, నిజానికి ముందు 20న ఫిక్స్ చేశారు కానీ ఇప్పుడు 22 కి షిఫ్ట్ చేశారు. దీనితో ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం సలార్ దెబ్బ తప్పేలా లేదని చెప్పాలి.
ఎందుకంటే హాలీవుడ్ సినిమా కాబట్టి అవతల దేశాల్లో ఆటో మాటిక్ గా ప్రిఫరెన్స్ అండ్ థియేటర్స్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ కూడా దానికే ఉంటాయి. దీనితో సలార్ చిత్రానికి మాత్రం ఇది ఊహించని థ్రెట్ అని చెప్పాలి. మెయిన్ గా సలార్ ని ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు.
కానీ ఇప్పుడు ఆక్వా మ్యాన్ రిలీజ్ కూడా ఇదే రోజు రావడం అయితే సలార్ కే నష్టం అని చెప్పాలి. మరి థియేటర్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతాయి లేక సజావుగానే రిలీజ్ ఉంటుందా అనేది చూడాలి.