ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం పుష్ప 2 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా డిసెంబర్ 5న విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే డిసెంబర్లో పుష్ప సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. పుష్ప విడుదలవుతుందని తెలిసినా కూడా అదే నెలలో విడుదలవుతున్న ఆ సినిమాలేమిటో ఇప్పుడు చూద్దాం. శివాజీ మహారాజ్ కుమారుడైన శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. ఈ సినిమా డిసెంబర్ 6న థియేటర్లలోకి వస్తుంది.
మొదటిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చల మల్లి సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. 1990ల కాలంనాటి నేపథ్య కథతో వస్తున్న ఈ సినిమాలో నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మరొక సినిమా ముసాఫర్ ది లయన్ కింగ్. ఈ సినిమా కూడా తెలుగులో డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఇక డిసెంబర్ 20వ తారీకున విడుదల అవుతున్న మరొక సినిమా యు ఐ. కన్నడ నటుడు ఉపేంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ఇది.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమా కూడా డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే రోజున ఎర్ర చీర ది బిగినింగ్ అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో రాజేంద్రప్రసాద్ మనవరాలు కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే డిసెంబర్ 20న విడుదలై సినిమాకి సీక్వెల్ గా వచ్చిన విడుదలై పార్ట్ 2 కూడా రిలీజ్ కాబోతుంది.
అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సంజయ్ దత్ నటించిన సినిమా వెల్కమ్ టు ది జంగిల్ కూడా ఇదే రోజు విడుదలవుతుంది.క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 14న వేదిక హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్ రిలీజ్ కాబోతుంది. ఇక డిసెంబర్ 21న మ్యూజిక్,డిసెంబర్ 25న రాబిన్ హుడ్ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్, బేబీ జాన్, డిసెంబర్ 27న పతంగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నానా పటేకర్ నటించిన వనవాసం సినిమా డిసెంబర్ 25న, జీరో సే రీస్టార్ట్ సినిమా డిసెంబర్ చివరివారంలో, అమెరికా నిర్మాణంలో వస్తున్న సితారే జామిన్ పర్ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతున్నాయి.