ఇన్సైడ్ టాక్ : “గాడ్ ఫాదర్” 50 రోజుల కష్టాలు ఇలా ఉన్నాయట.!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా “గాడ్ ఫాదర్”. ఈ ఏడాదిలోనే తన నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత మళ్ళీ మెగాస్టార్ కం బాక్ ని ఇచ్చారని అనుకున్నారు. కానీ ఈ చిత్రం మాత్రం టాక్ బాగానే తెచ్చుకున్నా వసూళ్ల పరంగా అయితే అనుకున్న రేంజ్ హిట్ కాదని ట్రేడ్ వర్గాలు చెప్పేసాయి.

అయితే మన టాలీవుడ్ లో సినిమాలు ఆడించుకోవడం కామన్ అని అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని రోజులు మాత్రమే జనం థియేటర్స్ కి వచ్చారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం థియేటర్స్ లో 50 రోజులకి చేరుకుంటుండగా ఈ సినిమాని 50 రోజులు ఆడించడానికి కష్టాలు ఎలా ఉన్నాయో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ సినిమాని కొన్ని థియేటర్స్ లో ఆడించడానికి డబ్బులు కొంతమంది నుంచి ఆ థియేటర్ యాజమాన్యానికి పడితే కానీ జనం లేకపోయేసరికి థియేటర్స్ లో గాడ్ ఫాదర్ రన్ అవ్వట్లేదట. దీనితో కొందరి నుంచి డబ్బులు వస్తే గాని థియేటర్స్ లో గాడ్ ఫాదర్ ఇప్పుడు రన్ అవ్వట్లేదట. దీనితో గాడ్ ఫాదర్ 50 రోజుల కష్టాలు ఇలా ఉన్నాయట. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా థమన్ సంగీతం అందించగా నయనతార నటించింది.