లాక్ డౌన్ తరువాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాభాలు అందిస్తాయా లేదా అనే విషయం కంటే కూడా అసలు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తాయా అనే విషయంపైనే అనుమానాలు ఎక్కువగా వచ్చాయి. ఇక హాలిడే సీజన్ కాకపోయినా కూడా ప్రదీప్ మొదటి సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రాఫిట్స్ ను అందుకుంది.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా నాలుగున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. అయితే మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఓపెనింగ్ రోజే సగం షేర్స్ ను అందుకున్నట్లు సమాచారం. ఇక శనివారం అయితే ఆ సంఖ్య 4కోట్లకు చేరింది. ఆదివారం కూడా అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా సినిమా అనుకున్న టార్గెట్ ను మూడు రోజుల్లోనే ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. నాలుగున్నార కోట్ల బ్రేక్ ఈవెన్ ను అందుకుంటుందో లేదో అనుకున్న ఈ సినిమా మొత్తానికి బ్రతికిపొయింది. పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవడంతో ప్రదీప్ ఫస్ట్ హిట్ కొట్టేసినట్లు చెప్పవచ్చు. ఇక సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలు కానుంది. నార్మల్ డెస్ లో వచ్చే కలెక్షన్స్ తోనే లాభాలు వస్తాయి. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ వారంలో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.