పాన్ ఇండియా సినిమా మార్కెట్ దగ్గర తన సొంత బ్రాండ్ తో పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పి తీరాలి. ఇది వరకు పాన్ ఇండియా సినిమాకి రాజమౌళి పరిచయం చేసిన హీరోలు అనే మార్క్ నుంచి పాన్ ఇండియా సినిమా దగ్గర తన సొంత ఇమేజ్ తో మార్కెట్ తెచ్చుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్.
మరి హిందీ మార్కెట్ లో అయితే ఎలాంటి రాజమౌళి లేకుండా 100 కోట్లు సినిమా ఉన్న హీరోగా కూడా బన్నీ నే నిలవగా ఇప్పుడు పుష్ప ది రూల్ తో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ని దున్నడానికి రెడీ అయ్యాడు. అయితే పుష్ప 2 ఎప్పుడు నుంచో సెన్సేషనల్ హైప్ ఉంది.
కాగా దీనికి ఏకంగా 1000 కోట్లు మార్కెట్ అంటూ టాక్ రాగ కొందరు ఇది సాధ్యమేనా అని అనుకున్నారు. కానీ నిన్నటి నుంచి అంతా మారిపోయింది. పుష్ప 2 ఈజీగా 1000 కోట్ల మార్కెట్ లో చేరుతుంది అని అంటున్న ట్రేడ్ వర్గాలు. పుష్ప టీజర్ ఫస్ట్ లుక్ చూసాక పైగా హిందీ జనంలో వస్తున్న మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ చూస్తుంటే ఈజీగా హిందీ సినిమా నుంచి 500 కోట్లు వస్తాయని అర్ధం అయిపోతుంది.
దీనితో వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 1000 కోట్లు వసూళ్లు చేస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇక ఈ సినిమాకి అయితే సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా పార్ట్ 2 ని కంప్లీట్ గా కొత్తగా డిజైన్ చేశారు. అలాగే రశ్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అయితే సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.