“పుష్ప 2” కి 100 మిలియన్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.!

రానున్న కొన్నేళ్లలో పాన్ ఇండియా సినిమాని షేక్ చేసే పలు చిత్రాల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. బాహుబలి 2 అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాకి సీక్వెల్స్ తర్వాత పాన్ ఇండియా వైడ్ ఆ రేంజ్ హైప్ ఉన్న సెన్సేషనల్ సీక్వెల్ గా అయితే ఇది నిలిచింది.

మరి అప్పట్లో మొదటి సినిమా టీజర్ తోనే సెన్సేషనల్ రెస్పాన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా పార్ట్ 2 మొదటి వీడియో టీజర్ కూడా మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ ని కొల్లగొట్టడం మరో మైండ్ బ్లాకింగ్ అంశంగా మారింది. ఇక ఈ వీడియో అయితే లేటెస్ట్ గా ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని అన్ని భాషల్లో కలిపి హిట్ చేసింది.

దీనితో ఈ సినిమా ఏ రేంజ్ లో ఈ సినిమా అన్ని భాషల్లో అంచనాలు ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. కాగా పుష్ప 2 అయితే ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ లు కలిసి నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.