రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా భవిష్యత్తులో పాన్ ఇండియా అనే తరహాలోనే రిలీజ్ అవుతుంటాయని చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిర్మాతలంతా దాదాపు 1000కోట్లకు పైగా ప్రభాస్ పై పెట్టుబడి పెట్టినట్లు లెక్క. ప్రతి సినిమా కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అయితే ఈ ప్లాన్ తో ప్రభాస్ మరోసారి పెళ్లి గండం నుంచి తెప్పించుకున్నాడు.
నిజానికి ప్రభాస్ పెళ్లి అంటే వెంటనే మ్యాటర్ ను డైవర్ట్ చేసేవాడు. కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు సహనం కూడా కోల్పోయారు. ఎన్నిసార్లు అడిగినా చేతిలో ఉన్న ప్రాజెక్టు అయిపోగానే చేస్కుంటానని చెప్పవాడట. అయితే బాహుబలి అనంతరం సాహో కారణంగా వాయిదా పడిన పెళ్లి చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక రాధేశ్యామ్ అనంతరంమైనా పెళ్లి అవుతుందని అనుకుంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పెద్ద సినిమాకు ఒప్పుకున్నాడు. అది 2023లో రానుంది.
ఇక ఇటీవల సలార్ అంటూ KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ ఖాళీగా ఉండే అవకాశం లేదు. పాన్ ఇండియా ప్రాజెక్టులు కాబట్టి ఒక్కో సినిమాకు ఎంత కాదనుకున్న ఏడాదిన్నర సమయం పడుతుంది. అంటే 2025 వరకు ప్రభాస్ కాలిగా ఉండకపోవచ్చు. అప్పటికి ప్రభాస్ 46 ఏళ్ళ వయసులోకి వచ్చేస్తాడు. మరి అప్పుడైనా ఫ్యామిలీ ఒత్తిడికి ప్రభాస్ లొంగిపోయి పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి మరి.