ఓ సినీ ప్రముఖుడు, ఓ ప్రధాన రాజకీయ పార్టీతో బేరసారాలు ఆడుతున్నాడట. వచ్చే ఎలక్షన్స్‌లో పోటీ చేస్తానని ముందుకొచ్చాడట. అయితే, పోటీ చేస్తాను కానీ, ఖర్చు మాత్రం పెట్టుకోనని తెగేసి చెప్పేస్తున్నాడట.
తనకున్న స్టార్‌డమ్‌ని యూజ్ చేసుకుని బరిలో అయితే దిగుతా కానీ, ఎలక్షన్లకు సంబంధించిన ఖర్చుల పూర్తి బాధ్యత మాత్రం పార్టీదే అని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట.
అయితే, నీకంత సీనూ సినిమా లేదని సదరు పార్టీ ఆ సినీ ప్రముఖుడ్ని తిరస్కరించిందట. తిన్నింటి వాసాలు లెక్కెట్టాడంటూ ఆ సినీ ప్రముఖుడిపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి.
దాంతో, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించడమే తప్పంటూ ఇతర కార్యకర్తలు కూడా అస్సలు ఎంటర్‌టైన్ చయడం లేదనీ సమాచారం. తాజాగా ఘటనతో మనోడి కక్కుర్తి సినీ పరిశ్రమ అంతా మరింత బాగా పాకేసింది. ఎవరా నటుడు ఏమా కథ.?
అఫ్‌కోర్స్.! ఎన్నికలు దగ్గరకొస్తున్నాయ్. సినీ రంగంలో ఇలాంటి వింతలు చాలానే కనిపించబోతున్నాయ్.