పీక‌ల‌దాకా తాగి మ‌హిళా డైరెక్ట‌ర్ ర‌చ్చ‌.. పోలీసుల‌ని బూతులు తిట్ట‌డంతో….

సెల‌బ్రిటీలు ఏ ప‌నైన సైలెంట్ పూర్తి చేస్తే వారికి మ‌ర్యాద‌, గౌరవం ద‌క్కుతాయి. లేదు నేను సెల‌బ్రిటీని అని రోడ్డు మీద‌కు వ‌చ్చి ర‌చ్చ చేస్తే పోలీసులు వారికి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్షే వేస్తారు. తాజాగా త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రు ముక్కున వేలేసుకునేలా చేసింది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్న 28 ఏళ్ల మ‌హిళ పీక‌ల దాకి పోలీసుల‌తోనే గొడ‌వ‌ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల‌లోకి వెళితే ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న కామిని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ప‌ని చేస్తున్న ఆమె స్నేహితుడు పార్టీ చేసుకోని త‌ప్ప తాగి కారులో వెళుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్న పోలీసులు వారి కారు ఆపి త‌నిఖీ చేశారు. కారు నడుపుతున్న శేషు ప్రసాద్ మోతాదుకు మించి మద్యం సేవించినట్టు తేలడంతో కారును సీజ్ చేశారు. దీంతో ప‌క్క‌నే ఉన్న కామిని పోలీసుల‌పై దుర్భాష‌లాడ‌సాగింది. నోటికి ఎంత వ‌స్తే అంత అన్న‌ట్టు వారిపై విచ‌క్ష‌ణారాహిత్యంగా ప్ర‌వ‌ర్తించింది.

ఒకానొక స‌మయంలో తాగితే త‌ప్పేంటి అంటూ పోలీసుల‌ని కొట్ట‌డానికి వెళ్ళింది. ఆమె స్నేహితుడు వారిస్తున్నా కూడా కంట్రోల్ కావ‌డం లేదు. ఇదంతా కెమెరాలో చిక్క‌డంతో పోలీసులు ఆమెపై ఐపీసీలోని సెక్షన్ 294 (బి) (దుర్భాషలాడడం), 323 (ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం) సహా మొత్తం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆదివారం సాయంత్రం చెన్నైలోని తిరువన్మియూర్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా, కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కామిని ప్ర‌వ‌ర్త‌న‌పై చాలా మంది నెటిజ‌న్స్ ఆమెని క‌ట‌క‌టాల వెనక్కు పంపించాల్సిందే అంటూ డిమాండ్స్ చేస్తున్నారు