జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. జగన్ పై అభిమానం ముందు పవన్ పై అభిమానం నిలబడలేదని ప్రూవైంది. పోటీచేసిన రెండు నియోజకవర్గాల నుండి ఓడిపోయాడు. కానీ రాపాక వరప్రసాద్ జనసేన తరపున తన నియోజకవర్గం నుంచి గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అనంతర కాలంలో రాపాక యూటర్న్ తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పవన్‌కు అసెంబ్లీలో రాపాక నుంచి షాక్‌ల మీద షాక్ లు తప్పడం లేదు. పవన్ కళ్యాణ్ అతని మద్దతుదారుల్ని నిరాశపరుస్తూ… అతను వైసీపీకి చాలా మద్దతు ఇస్తున్నాడు. ఇలా చేస్తున్నందుకు జనసేన పార్టీ నుండి రాపాకాను అనర్హులుగా ప్రకటించడానికి పవన్ కు ఒక్క సెకను కూడా పట్టదు. అయితే, జగన్‌ను ప్రశంసిస్తున్న రాపాకను పవన్ కొన్ని కారణాల వల్ల అలా చేయడం లేదు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఫిర్యాదు చేసిన జగన్ ధోరణికి పవన్ ప్రవర్తన పూర్తి విరుద్ధం. జగన్ లాగా పవన్ ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రాపాకకు వ్యతిరేకించి దూరం పెడితే తన పార్టీ గొంతు అసెంబ్లీలో వినబడదని పవన్ భయపడుతున్నారని కొందరు అంటున్నారు. కానీ ప్రస్తుతం రాపాక తీరు మాత్రం ఏమాత్రం బాలేదు. పవన్ ని జనసేనలను విమర్శిస్తూ జగన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. సీఎం జగన్ నాటకాలాడుతున్న రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ ని క్లైమాక్స్ లోకి తీసుకుంటుండగా, పవన్ మాత్రం రాపాక వర ప్రసాద్ పై ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు. అయితే పార్టీ తరపున అవసరం ఉన్నప్పుడు పోరాడటం .. సినిమాల్లో నటించడం తప్ప ప్రస్తుత సన్నివేశంలో పవన్ వేరొక గత్యంతరం లేదని భావించారా? తన బలం బలహీనత తెలిసిన నాయకుడిగా తెలివైన్ గేమ్ ఆడుతున్నాడా? అన్నది రాబోవు ఎన్నికలు తేల్చాల్సి ఉంటుంది.