ఐఎండిబి టాప్ 250 లిస్ట్ రిలీజ్… మొదటి స్థానంలో కన్నడ సినిమా..?

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా విడుదలవుతున్న సినిమాలు అన్ని ప్రాంతాలలోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా తెలుగు కన్నడ భాషలలో విడుదలైన సినిమాలు మన భారత దేశ సినీ క్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒక సినిమా హిట్, ప్లాప్ గురించి ఆ సినిమాకి ఉన్న ప్రేక్షకాదరణ బట్టి ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) రేటింగ్స్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండిబి(IMDb).. తాజాగా ఇండియా లోని 250 బెస్ట్ ఫిలిమ్స్ లిస్ట్ రిలీజ్ చేసింది.

ఇప్పటివరకు విడుదలైన హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలకు సంబంధించిన బెస్ట్ సినిమాలు ముందు వరసలో నిలిచాయి. అయితే ఐఎండిబి ఇటీవల విడుదల చేసిన టాప్ 250 ఇండియన్ సినిమాలలో ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ సినిమా మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రముఖ కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమాని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా.. అక్టోబర్ 15వ తేదీ తెలుగులో విడుదల ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుంది. ఐఎండిబి విడుదల చేసిన జాబితాలో తెలుగు సినిమాలలో రామాయణం (1993) రెండవ స్థానంలో నిలువగా.. 17వ స్థానంలో కేరాఫ్ కంచరపాలెం(2018), 22వ స్థానంలో జెర్సీ.. 39 వ స్థానంలో సీతారామం.. 44 వ స్థానంలో మహానటి.. 48లో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ.. 101లో బాహుబలి 2.. 125లో బొమ్మరిల్లు.. 129లో రంగస్థలం.. 190వ స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది.