NBK107: బాలయ్య#NBK107 కన్నడ సినిమా కాపీనా… క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

NBK107: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంత విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 107 వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఈ సినిమా నుంచి తాజాగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో ఈ సినిమాపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ‘NBK107’ కన్నడ హిట్ ‘మఫ్టీ’ నుండి కథ నుంచి ప్రేరణ పొందింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కొంతమంది నెటిజన్లు సరాసరి చిత్ర బృందానికి ట్యాగ్ చేస్తూ వివరణ కావాలని కోరారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ ప్రశ్న పై స్పందిస్తూ బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా కన్నడ సినిమా కాపీనా కాదా అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మేకర్స్ ఈ విషయంపై మాట్లాడుతూ అసలు నందమూరి బాలకృష్ణ తన 107 వ చిత్రాన్ని ఏ సినిమా నుంచి ప్రేరణగా తీసుకోలేదని ఈ సినిమా ఏ సినిమా కాపీ కాదని వెల్లడించారు. అయితే బాలకృష్ణ నటిస్తున్న NBK107 ఫస్ట్ లుక్ పోస్టర్ ‘మఫ్టీ’లో శివ రాజ్‌ కుమార్ లుక్‌ని పోలి ఉండటంతో ఈ విధమైనటువంటి ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయని అయితే ఇందులో ఏ విధమైనటువంటి వాస్తవం లేదని మేకర్స్ ఈ సినిమా గురించి వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు.ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తండ్రీకొడుకుల పాత్రల ద్వారా బాలకృష్ణ సందడి చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.