బాలకృష్ణ కొంచమైనా సిగ్గుందా… తండ్రిని చంపిన వ్యక్తితో షోలు చేయడమా: కొడాలి నాని

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి కాగా రెండవ సీజన్ కూడా 14వ తేదీ నుంచి ప్రారంభం కావడానికి సిద్ధమైంది ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు చెప్పారు అయితే ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పెద్ద 420. ఆయన ఎన్టీఆర్ కాళ్ళ దగ్గరే ఉండి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.ఇలా ఎన్టీఆర్ ని చంపి తన పార్టీని లాక్కున్న గజదొంగ చంద్రబాబు నాయుడు అంటూ పెద్ద ఎత్తున మండి పడ్డారు.

బాలకృష్ణ నీకు కొంచమైన సిగ్గుందా నీ తండ్రిని చంపిన వాడిని పిలిచి ప్రత్యేకంగా షోలు చేస్తారా అంతేకాకుండా తన కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి కూడా చేశావు అంటూ పెద్ద ఎత్తున కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి కొడాలి నాని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ఎపిసోడ్ మరొక రోజులో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమం ఏపీలో పలు రాజకీయ చర్చలకు కూడా దారితీస్తుందని తెలుస్తుంది.