ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తిమ్మిర్ల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాళ్లు, చేతుల్లో తరచుగా తిమ్మిర్లు వస్తుంటే ఆ సమస్య వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తిమ్మిర్లు వస్తే సమస్య లేదు కానీ తరచూ వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
రక్తం సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం వల్ల ఎక్కువమందిని ఈ సమస్య వేధిస్తుంది. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లకు నరాలు దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తిమ్మిర్లు కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
షుగర్ సమస్యతో బాధపడేవాళ్లకు నరాలు దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళు తిమ్మిరికి గురయ్యె అవకాశం అయితే ఉంటుంది. ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థరైటీస్ వల్ల కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. విటమిన్ బీ లేదా ఈ విటమిన్ లోపించిన సమయంలో కూడా నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ , హెచ్ఐవీ, అధికరక్తపోటు, టీబీ వ్యాధులకు వాడే మందుల వల్ల తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు నరాలను దెబ్బతీయడం వల్ల కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోయినట్లయితే కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. థైరాయిడ్ సమస్యతో ఉన్నవారిలో, అలాగే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో కూడా తిమ్మిర్లు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.