గూగుల్ లో మీరు ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నార.. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే సరి..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ప్రపంచమంతా డిజిటల్ మయం అయ్యింది. ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. సాధారణంగా ముఖ్యమైన వ్యక్తుల గురించి సెలబ్రిటీల గురించి గూగుల్ లో సర్చ్ చేస్తే వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా గూగుల్‌ సెర్చ్‌లో తమ పేరును సెర్చ్‌ చేస్తే వారి పేరుపై సమాచారం రావాలని కోరుకుంటున్నారు.

అయితే ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇలా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోరుకునే వారి కోసమే గూగుల్ ఓ ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘పీపుల్ కార్డు’ పేరుతో గూగుల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌.. గూగుల్‌లో సెర్చ్‌ చేసినప్పుడు సరైన వ్యక్తిని గుర్తించటానికిది ఉపయోగపడుతుంది. గూగుల్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌లో గూగుల్‌ మనకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖంగా చూపడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ అద్భుతమైన ఫీచర్‌ భారత్‌తో పాటు కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ని గూగుల్ లో ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషల్లో సెట్‌ చేసుకోవచ్చు. అయితే ఈ పీపుల్ కార్డు ఫీచర్ ఎలా రూపొందించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* పీపుల్ కార్డు ఫీచర్ రూపొందించడానికి ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ‘యాడ్‌ మీ టు సెర్చ్‌’ అని టైప్‌ చేయాలి.
* అలా టైప్ చేసిన వెంటనే ‘యాడ్‌ యువర్‌సెల్ఫ్‌ టు గూగుల్‌ సెర్చ్‌’ అని ఓపెన్‌ అవుతుంది. అందులోకి వెళ్లి ‘గెట్‌ స్టార్టెడ్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
* ఆ తరువాత మీ పేరు, నివసించే ప్రాంతం, పని, చదువు, ఈమెయిల్‌, వెబ్‌సైట్‌లాంటి మీ వ్యక్తిగత వివరాలను ఫిల్‌ చేయాలి.
* అలాగే వీటితో పాటు అదనంగా మీ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు.
* అయితే మీ కాంటాక్ట్‌ వివరాలు చూపించాలా.? వద్దా? అన్నది మీ ఇష్టం.
* ఇలా పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూను సెలక్ట్‌ చేసుకోని అన్ని వివరాలను చెక్‌ చేసుకోవచ్చు.
* ఇక చివరిగా కార్డును సేవ్‌ చేసుకోవాలి. దీంతో మన పేరుతో సెర్చ్‌ చేసినప్పుడు గూగుల్ పీపుల్‌ కార్డు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.