లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాల పాలసీల ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్నిరకాల స్కీమ్ లను అందిస్తుంది. ఇలా ఎల్ఐసి అందిస్తున్న కొన్ని రకాల స్కీమ్స్ ద్వారా ప్రజలు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. ఎల్ఐసి ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువగా రిటర్న్స్ వస్తుంటాయి.. అందుకే చాలా మంది ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా రోజు రోజుకి పాలసీదారుల సంఖ్య పెరిగి పోవడంతో పాలసీదారుల సౌలభ్యం కోసం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇలాఇప్పటివరకు వచ్చిన పాలసీలల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి.
దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునేవారు ఈ ప్లాన్ ఎంచుకోవటం మంచిది. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీలో మెచ్యూరిటీ తర్వాత కూడా బెనిఫిట్స్ కూడ లభిస్తాయి. దీన్నే సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు. పాలసీహోల్డర్ స్కీమ్ మెచ్యూరిటీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత వారికి సర్వైవల్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. పాలసీ ముగిసిన తర్వాత కూడా ప్రయోజనం పొందాలనుకునేవారు ఈ పాలసిని తీసుకోవచ్చు. ఇక ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కనీసం రూ.2,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంత సమ్ అష్యూర్డ్ అయినా ఎంచుకోవచ్చు.
ప్రీమియం చెల్లించే టర్మ్ 15, 20 , 25 , 30 ఏళ్లుగా ఉంటుంది. ఇక ఈ పాలసీని మీరు ఏ వయసులో తీసుకుంటే మీకు 100 సంవత్సరాలు నిండే వరకు ఈ పాలసీ ఉంటుంది.100 ఏళ్లు పూర్తైన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి.ఇక పాలసీహోల్డర్ చివరి ప్రీమియం చెల్లించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ వస్తాయి. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 8 శాతం చొప్పున లెక్కించి ప్రతీ ఏటా సర్వైవల్ బెనిఫిట్ ఇస్తారు. ఇలా 99 ఏళ్ల వయస్సు వచ్చేవరకు తీసుకోవచ్చు. లాంగ్ టర్న్ పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు జీవన్ ఉమాంగ్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలం బెనిఫిట్స్ పొందవచ్చు.