సాధారణంగా ఒక మనిషికి కొన్ని డాక్యుమెంట్స్ ఎంతో కీలకంగా ఉంటాయి అలాంటి వాటిలో పాస్ పోర్ట్, పాన్ కార్డు ఓటర్ కార్డ్ వంటివి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అని చెప్పాలి. అయితే ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ మనకు గుర్తింపు కార్డులుగా ఉంటాయి అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన గుర్తింపు కార్డులు అయినటువంటి ఓటర్ ఐడి, పాన్ పాస్ పోర్ట్ వంటి వాటిని ఏం చేస్తారు అనే విషయాలు చాలామందికి తెలియదు అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన గుర్తింపు కార్డులను ఏం చేస్తారు అనే విషయానికి వస్తే…
ఒక మనిషి చనిపోయిన తర్వాత తన గుర్తింపు కార్డులను కుటుంబ సభ్యులు చాలా భద్రంగా దాచి పెట్టడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా తరచూ విదేశాలకు వెళుతున్నటువంటి వారు కనక చనిపోతే వారి పాస్పోర్ట్ లను భద్రంగా దాచి పెట్టాలి లేకపోతే ఈ పాస్పోర్ట్ ఉపయోగించి పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. ఆధార్ కార్డు మాదిరిగా పాస్‌పోర్టును రద్దు చేసే పద్దతి ఇంకా చేయలేదు. కానీ పాస్‌పోర్ట్‌కి కాలపరిమితి ఉంటుంది ఆ తర్వాత దానిని పునరుద్ధరించుకోవాలి. లేకపోతే పాస్పోర్ట్ పనిచేయదు.
భారతదేశంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఇలా భారతదేశ పౌరుడిగా నిరూపించుకోవడంలో ఓటు హక్కు ఎంతో ప్రాధాన్యమైనది. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఓటర్ కార్డ్ ఏం చేయాలి అనే విషయాన్ని వస్తే… చనిపోయిన వ్యక్తి ఓటర్ ఐడిని మనం రద్దు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఫారం-7 నింపాలి. ఆ తర్వాత ఈ కార్డ్ రద్దు చేస్తారు. కానీ దానిని రద్దు చేయడానికి మీకు మరణ ధృవీకరణ పత్రం అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి పాన్ కార్డ్ చాలా ముఖ్యం. అయితే ఎవరైనా మరణించిన తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. వాస్తవానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రక్రియ పూర్తికాని వరకు మీరు దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ వారికి సరెండర్ చేయాలి.