క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా కూడా లోన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసా..?

సాధారణంగా బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందటానికి మన సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో విధించిన గడువులోగా తీసుకున్న రుణం చెల్లించకపోతే మన సిబిల్ స్కోర్ , క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. ఇలా సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో మనం లోన్ తీసుకునే అవకాశం ఉండదు. అయితే మీరు క్రెడిట్ స్కోర్‌ తక్కువ ఉన్నా కూడా సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ కోసం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉండదు. కానీ తక్కువగా ఉన్నప్పుడే సమస్యలు మొదలవుతాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు.
క్రెడిట్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే చాలా మంచిది. CIBIL స్కోర్ 550 నుంచి 750 మధ్య ఉంటే మంచిది. అయితే CIBIL స్కోర్ 550 కంటే తక్కువ ఉంటే అప్పుడు బ్యాంకుల నుంచి ప్రైవేట్‌ సంస్థల నుంచి రుణాలు పొందలేరు.

• క్రెడిట్ స్కోర్‌ తక్కువగా ఉన్నప్పటికీ లోన్ తీసుకోవాలనుకునే వారు ఇతరుల గ్యారెంటీ తో లోన్ పొందవచ్చు. బ్యాంక్ అతని క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించి లోన్ మంజూరు చేస్తుంది. ఒకవేళ మీరు లోన్ చెల్లించకపోత గ్యారెంటర్‌ తో లోన్ వసూలు చేస్తుంది.

• అలాగే చెడ్డ క్రెడిట్ స్కోర్‌ ఉన్నప్పుడు ఆస్తిని తనఖా పెట్టి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇది హామీదారు వంటిది. అయితే రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది.

• చెడ్డ క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం వల్ల లోన్ పొందడం చాలా కష్టం. అయితే, తక్కువ మొత్తంలో వ్యక్తిగత రుణం కోసం అడిగితే బ్యాంకులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

• కొన్ని సందర్భాలలో క్రెడిట్ నివేదికలో లోపాల వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ మీద ప్రభావం పడుతుంది. అందువల్ల కనీసం సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ నివేదికను ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోండి. ఏదైనా పొరపాటు జరిగితే సదరు కంపెనీకి తెలియజేయండి. తర్వాత రుణం పొందడం తేలిక అవుతుంది.