మహిళలు జర జాగ్రత్త… ఇది కనుక తెలిస్తే ఇకపై ఎవరు లిప్ స్టిక్ వాడరు తెలుసా?

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఆ అందం కొన్నిసార్లు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిసినప్పటికీ కూడా చాలామంది అందానికి ప్రాధాన్యత ఇస్తూ అందం కోసం అందంగా కనిపించడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఏ చిన్న పార్టీ అయినా ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్న అమ్మాయిలు ఎక్కువగా లిప్ స్టిక్ ఉపయోగించడం మనం చూస్తుంటాము. అయితే ఇలా లిప్ స్టిక్ ఉపయోగించడం ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే ఒక ఆరోగ్య సంస్థ మహిళలు ఉపయోగించే లిప్ స్టిక్ పై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా చాలామంది మహిళలు నాసిరకం లిప్ స్టిక్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. లిప్ స్టిక్ లో ఎక్కువగా లెడ్ అనే కెమికల్ ఉపయోగిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. ఈ కెమికల్ ప్రభావం కారణంగా నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుందని తెలుస్తోంది.

 

ఈ లెడ్ అనే కెమికల్ హార్మోన్ల అసమర్థులు ఎత్తుకు కూడా కారణం అవుతుంది.అదేవిధంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీర ఎదుగుదల పైన పునరుత్పత్తి వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేశారు. ఖరీదైన లిప్ స్టిక్ తో పోలిస్తే నాసి రకపు

లిప్ స్టిక్ లో రసాయనాలు అధికంగా కలుపుతున్నారని,

లిప్ స్టిక్ రంగు ఎంతో కాంతివంతంగా కనిపించడం కోసమే ఇలాంటి రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఇలా అందంగా కనిపించడం కోసం వేసుకొని లిప్ స్టిక్ కారణంగా ఇన్ని రకాల అనారోగ్యం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది