కాలంతో సంబంధం లేకుండా ఎంతోమంది ఆస్తమా వల్ల బాధ పడటంతో పాటు ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆరోగ్య సమస్య ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘాకాలిక సమస్య కాగా ఈ సమస్య బారిన పడిన వాళ్లలో వాయు నాళాలు కుంచించుకు పోతాయి. వర్షాకాలం, చలికాలంలో ఆస్తమా రోగులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల వల్ల కూడా ఆస్తమా రోగులకు నష్టం కలుగుతుంది.
ఇంట్లోని దుమ్ము, బూజు ఆస్తమాను తీవ్రం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఆస్తమా సమస్యతో బాధ పడేవాళ్లు బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లను ధరించాలి. తేమ స్థాయిలు ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయనే విషయాలను గుర్తుంచుకోవాలి. పుప్పొడి, దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల జుట్టు, బూజు కూడా కొన్ని సందర్భాల్లో ఆస్తమాకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇన్‌హేలర్‌లతో పాటు డాక్టర్ సూచించిన మందులను వాడటం ద్వారా ఆస్తమా దూరమవుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచే ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు చలికాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలం రక్తనాళాలు సహజంగా ముడుచుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. చలికాలంలో వేడి ఆహారాలు తీసుకుంటే మంచిది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లపై చలికాలంలో వైరస్ లు తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పండ్లు, కాయగూరలు, నట్స్ తీసుకోవడం ద్వారా ఆస్తమా సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, ఐస్‌వాటర్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.