మహిళల్లో చాలామంది గర్భాశయంలో గడ్డలు ఉంటే భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే చాలామంది మహిళలకు తెలియని విషయం ఏంటంటే ఈ గడ్డలు ప్రమాదకరం కాదు. ఈ గడ్డలు క్యాన్సర్ అసలే కాదు. అయితే గర్భాశయంలో కణితుల పరిమాణం పెరిగితే నెలసరికి సంబంధించిన సమస్యలు సైతం పెరుగుతాయి. గడ్డలు చిన్నగా ఉంటే మాత్రం మందులు వాడటం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఎండోస్కోపీ, ఎంబొలైజేషన్ ద్వారా ఈ సమస్యలు సులువుగానే దూరమవుతాయి. మహిళల్లో సాధారణంగా 30 సంవత్సరాల వయస్సు తర్వాత ఈ గడ్డలు ఏర్పడటం జరుగుతుంది. గర్భాశయంలో గడ్డలు ఏర్పడితే నెలసరి చిక్కులు వేధించడంతో పాటు పొట్టలో ఇతర ఇబ్బందులు సైతం వస్తాయి. గడ్డలు చిన్నగా ఉన్న సమయంలో హార్మోన్ థెరపీ, కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా సమస్య దూరమవుతుంది.
గతంలో ఇలాంటి సమస్య వచ్చిన మహిళల్లో గర్భాశయాన్ని తొలగించేవారు. అయితే ప్రస్తుతం లాప్రోస్కోపిక్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం వల్ల గర్భసంచి తొలగించకుండానే చికిత్స చేయవచ్చు. కొన్ని రకాల పైబ్రాయిడ్లకు చికిత్స సరిపోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలలో ఎంబొలైజేషన్ చికిత్స ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
గడ్డలను పగలగొట్టడం వల్ల సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కేవలం ఒకే ఒకరోజు చికిత్స ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలకు ఈ చికిత్స విధానం ఎంతో ప్రయోజనకరం అని చెప్పవచ్చు.