నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. డిగ్రీ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. 500 అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. క్లాస్ 3 కేడర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 500 ఉద్యోగ ఖాళీలలో తెలుగు రాష్ట్రాల్లో33 ఉన్నాయి. ప్రాంతీయ భాష చదవడం, రాయడం వచ్చిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈరోజు నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. https://nationalinsurance.nic.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 62 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. పరీక్షలు నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. నవంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.