సాధారణంగా శృంగార విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు మొహమాటం తోను లేక సిగ్గుతోను ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరచారు. అది మీరు చేసే పొరపాటే ఆధునిక వైద్య నిపుణులు మరియు ఆయుర్వేద వైద్య నిపుణుల సూచనల ప్రకారం పెళ్లయిన దంపతులిద్దరూ శృంగార శాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నప్పుడే శృంగారంలో సంపూర్ణ తృప్తిని పొంది సుఖప్రదమైన జీవితాన్ని గడపగలరని సూచిస్తున్నారు. ఆయుర్వేదంలో శృంగార శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది.
మానవ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాల్లో శృంగారం కూడా ప్రధానమైనది గానే ఆయుర్వేదం పేర్కొంటుంది. పురాతన శృంగార శాస్త్ర ప్రకారం ఆరోగ్యకరమైన, నియంత్రిత లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మనలో శారీరక ఒత్తిడి తగ్గి మెదడు చురుకుదనం పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది,వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు, మానసిక ఉల్లాసం కలుగుతుంది. అయితే శృంగారంలో పాల్గొనడానికి అనువైన కాలం పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారానికి అనువైన కాలం శీతాకాలమని ఆయుర్వేదం చెబుతోంది.చలి తీవ్రత ఎక్కువగా ఉండే శీతాకాలం సీజన్లలో శృంగారంలో పాల్గొంటే తృప్తి ఎక్కువగా లభిస్తుంది.వేసవికాలంలో ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే శారీరక శ్రమ తప్ప తృప్తి ఉండదట.వర్షాకాలంలో,శరీర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి శృంగారంలో అధికంగా పాల్గొనడం
మంచిది కాదు.ఎందుకంటే అది వాతాన్ని తీవ్రతరం చేస్తుంది. ఆదర్శవంతంగా, ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్స్ చేయడం మంచిది.
శృంగార కార్యకలాపాలకు ముందు కచ్చితంగా స్నానం చేయాలి, శృంగారం తర్వాత కూడా స్నానం చేయాలి. కడుపునిండా భోజనం చేసి శృంగారంలో పాల్గొనవద్దు. అలాగని ఖాళీ కడుపుతో ఎప్పుడూ సెక్స్ చేయకండి
ఇబ్బందికరమైన భంగిమల్లో సెక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల అలసట, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదం ప్రకారం సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సీతాఫలం, ముడి బియ్యం, నెయ్యి పాలు, బాదంపాలు వంటి సహజ ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకానీ మార్కెట్లో దొరికి లైంగిక సామర్థ్యాన్ని పెంచే టాబ్లెట్లను అస్సలు వాడకండి.