మనలో చాలామంది నిద్రించే సమయంలో కూడా జీన్స్ ధరిస్తూ ఉంటారు. ఈ అలవాటు అంత మంచిది కాదని తెలిసినా పట్టించుకోరు. జీన్స్ వేసుకుని నిద్రించడం వల్ల ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిగుతుగా ఉండే జీన్స్ ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
జీన్స్ మరీ టైట్ గా ఉంటే కండరాలు, నరాలకు రక్త ప్రసరణ జరగదు. జీన్స్ బిగుతుగా ఉండటం వల్ల గాలి ప్రసరణను సైతం అడ్డుకుంటుందని చెప్పవచ్చు. జీన్స్ ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా జీన్స్ ధరిస్తే జననాంగాల ప్రాంతాలలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. జీన్స్ మరీ టైట్ గా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగే ఛాన్స్ ఉండదు.
కొన్ని సందర్భాల్లో జీన్స్ గ్యాస్, ఉబ్బరం లాంటి కొత్త ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. రాత్రి సమయంలో జీన్స్ ధరించడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మహిళలు జీన్స్ ధరిస్తే పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
జీన్స్ ఎక్కువగా ధరించే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. రాత్రి సమయంలో జీన్స్ ధరించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జీన్స్ ఎక్కువగా ధరించే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.