మనలో చాలామంది పూజించే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు కాగా శివుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది. శివలింగాన్ని శమీ ఆకులతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని చాలామంది భావిస్తారు. శివుడికి జలాభిషేకం చేయడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. శివలింగ ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉండగా నీరు, బిల్వపత్రం, ఉమ్మెత్త, జమ్మి ఆకులతో శివుడిని పూజిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి.
శివుడిని పూజించే వాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి శివాలయానికి వెళ్లి ఉత్తరం లేదా తూర్పు దిశలో శివలింగం దగ్గర కూర్చుని పూజలు చేయాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటితో అభిషేకం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. తెల్లని వస్త్రాలు, జంధ్యం, అక్షతలు, జనపనారను శివుడికి సమర్పించడం ద్వారా కూడా మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించే సమయంలో తాజా ఆకులను వాడితే మంచిది. అప్పటికప్పుడు కోసిన ఆకులతో పూజ చేయడం వల్ల దేవుని అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు. శివునికి అనేక రూపాలు ఎన్నో మనోభావాలు ఉండగా సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శివుడిని భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు.
శివుడిని పూజించడం వల్ల వ్యాధి, దుఃఖం, భయం ఉండదని చెప్పవచ్చు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపించడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి. శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా శివ ధ్యానం చేస్తే మంచిదని చెప్పవచ్చు.
మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించడం వల్ల ఆపదలు తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే క్షయ వ్యాధి నుంచి ఉపశమనం లభించే ఛాన్స్ ఉంటుంది. శనివారాలలో నూనె, నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా కూడా శివుని అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పచ్చు.