మీ ఆధార్ నెంబర్ ను లాక్ చేయాలా… ఒక్క ఎస్ఎంఎస్ తో ఇలా లాక్ చేసేయండి?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో మంచిగా అభివృద్ధి చెందడంతో ప్రపంచంలో ఏ మారుమూల ఏ చిన్న సంఘటన జరిగిన ఇట్టే ఆ సంఘటన గురించి మనం తెలుసుకోవచ్చు. ఇలా అభివృద్ధి చెందిన టెక్నాలజీ తో అన్ని విషయాలు క్షణాల్లో మనకు చేరువ అవుతున్నాయి. అయితే ఇది ఎంత ప్రయోజనకరంగా ఉందో అంతే ప్రమాదకరంగా ఉందని చెప్పాలి.అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఆసరాగా చేసుకొని ఎంతోమంది సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఎంతోమంది భారీ స్థాయిలో మోసపోయిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఈ విధంగా సైబర్ నేరగాల మోసానికి గురికాకుండా ఉండడం కోసం ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకువచ్చిన సైబర్ నేరగాళ్లు అంతకంతకు రెచ్చిపోతూ ఒక వ్యక్తి పర్సనల్ డేటాను దొంగలించి వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇందులో ఆధార్ నంబర్ ట్యాంపరింగ్ చాలా ప్రమాదకరమైనది. ప్రస్తుతం మన బ్యాంకు అకౌంట్ల దగ్గర నుంచి పాన్ కార్డు, రిజిస్ట్రేషన్లు ఇలా ఏది కావాలన్నా ఆధార్ అథంటికేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. ఇదే సైబర్నిర్గాల పాలిట వరంగా మారింది.

ఒక్క ఆధార్ యాక్సస్ చేస్తే చాలా వినియోగదారుల సమస్త డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయినట్లే. అందుకనే ఆధార్ బహిర్గతం కాకుండా కాపాడుకోవడం.. దానిని భద్రపరచుకోవడం చాలా కీలకం. అందుకోసమే ప్రభుత్వం ఏ మంచి ఫీచర్ ను ఆధార్ భద్రత కోసంఒక ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు దీని ద్వారా కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపించి మన ఆధార్ నెంబర్ ఇతరులకు కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు. GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నంబర్లను టైప్ 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. UIDAI నుంచి మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.

LOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు, మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసి మళ్లీ పంపాలి.ఇలా ఎస్ఎంఎస్ సక్సెస్ఫుల్గా వెళ్ళిన తర్వాత మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. అయితే మీ ఆధార్ నెంబర్ ఒక మొబైల్ నెంబర్ తో కాకుండా రెండు మూడు మొబైల్ నెంబర్ తో లింక్ చేసి ఉంటే చివరిలో నాలుగు అక్షరాలకు బదులు 8 నెంబర్లను టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఇలా చేయటం వల్ల మన ఆధార్ నెంబర్ ఇతరులకు ఎప్పటికీ కనిపించదు. దీంతో మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పడకుండా జాగ్రత్తగా ఉంటుంది.