స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్.. ఏకంగా 39 వేల ఉద్యోగాలతో?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఏకంగా 39 వేల ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వేర్వేరు రక్షణ దళాల్లో కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. అక్టోబర్ నెల 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 39481 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగ ఖాళీలు 15,654 ఉండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 11,541 ఉద్యోగ ఖాళీలు సశస్త్ర సీమా బల్‌కు 819 ఉద్యోగ ఖాళీలు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఉద్యోగ ఖాళీలు 3017 ఉన్నాయి. అస్సామ్ రైఫిల్స్ కు సంబంధించి 1248 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపులు ఉండనున్నాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదని తెలుస్తోంది.

ssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు.