నార్త్ ఈస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. గోరఖ్ పూర్ లో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆన్ లైన్ ద్వారా శిక్షణ కోసం దరఖాస్తులను కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 1104 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. టర్నర్, ట్రిమ్మర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ డీజిల్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 9 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
పదో తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇతర అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని సమాచారం అందుతోంది. ఈ నెల 24వ తేదీన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
ఫిబ్రవరి నెల 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం.