ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే రూ.36 వేలు అకౌంట్లోకి పొందే అవకాశం.. ఎలా అంటే?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో అద్భుతమైన పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా ఊహించని స్థాయిలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసీ తన కస్టమర్ల కోసం వేర్వేరు పథకాలను అమలు చేస్తుండగా ఈ పాలసీలలో జీవన్ ఉమంగ్ అనే ఎండోమెంట్ పాలసీ కూడా ఉంది.

గరిష్టంగా 30 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మెచ్యూరిటీ పూర్తైన తర్వాత బ్యాంక్ అకౌంట్ లోకి ప్రతి సంవత్సరం స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఈ స్కీమ్ బెనిఫిట్ ఏంటంటే గరిష్టంగా 100 సంవత్సరాల వరకు కవరేజీని పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్లాన్ మొత్తంలో ప్రతి సంవత్సరం 8 శాతం వాటాగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే రూ. 4.5 లక్షల బీమా రక్షణ కోసం జీవన్ ఉమంగ్ పాలసీని కొనుగోలు చేస్తే సంవత్సరానికి రూ. 36,000 పొందే అవకాశాలు ఉంటాయి. 5 లక్షల రూపాయలకు పాలసీ తీసుకుంటే 55 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. ఈ విధంగా 100 ఏళ్లు వచ్చే వరకు హామీ మొత్తంలో 8 శాతం పొందే అవకాశాలు ఉంటాయి.

ఏదైనా కారణాల వల్ల పాలసీదారుడు చనిపోయినా వైకల్యం సంభవించినా డబ్బు నామినికి లభిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు సెక్షన్ 80 సీ కింద పాలసీలో మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలసీలో కనీసం 2 లక్షల నుంచి ఎంత మొత్తానికైనా బీమా తీసుకోవచ్చు. సమీపంలోని ఎల్.ఐ.సీ కార్యాలయం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.