నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రాతపరీక్ష లేకుండానే 361 పోస్టులకు నోటిఫికేషన్!

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు నాలుగు సంవత్సరాల పాటు పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 136 ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. హైదరాబాద్,వైజాగ్,బెంగళూరు, భానూర్ ప్రాంతాలలో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆఫీస్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీలు 361 ఉండగా ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 136, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 142, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 83 ఉన్నాయి. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌ చేయడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలు కాగా ఇతర ఉద్యోగాలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్‌ ఉద్యొగానికి నెలకు 39 వేల రూపాయల వరకు లభించనుండగా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు నెలకు రూ.29,500 వేతనం లభిస్తుంది.

ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మాత్రం 27,500 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. బీడీఎల్‌ భానూర్ (సంగారెడ్డి), బీడీఎల్‌ విశాఖపట్నం యూనిట్ లతో పాటు బీడీఎల్‌ కంచన్‌బాగ్ (హైదరాబాద్) లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి